పారేసే వస్తువులు కూడా పనికొస్తాయి..

పారేసే వస్తువులు కూడా పనికొస్తాయి..

క్రియేటివిటీ ఉండాలే గానీ.. వాడి పారేసిన వస్తువులను కూడా మళ్లీ పనికొచ్చేలా చేయొచ్చు. అరిగిపోయిన టైర్లు, పనికిరాని రైళ్ల స్ప్రింగ్ లు,  మూలనపడ్డ వీఐపీ చైర్.. ఇలా ఏదైనా కావచ్చు. అలాంటివాటిని ఓ ఔత్సాహికుడు ఎంత ఉపయోగకరంగా మలచుకున్నాడో.. మహీంద్రా అండ్ మహీంద్రా చైర్మన్ ఆనంద్ మహీంద్రా కంటపడింది. వెంటనే ఆ ఫొటోల్ని ట్విట్టర్లో పెట్టి కామెంట్ రాశారు. 

మీ ఇంటిని డిజైన్ చేసుకోవాలంటే లక్షలాది రూపాయలు వెచ్చించాల్సిన అవసరం లేదని, క్రియేటివిటీ ఉన్న ఆటో ఇంజినీర్ కూడా సరిపోతాడన్నారు.