బైకు కు మంటలు.. కాపాడిన పోలీసులు..

బైకు కు మంటలు.. కాపాడిన పోలీసులు..

ఉత్తరప్రదేశ్ పోలీసులు సోమవారం ఓ బైక్‌ను చేజ్‌ చేసి ముగ్గురి ప్రాణాలను కాపాడారు. ఇటావాలోని జాతీయ రహదారిపై ఇద్దరు వ్యక్తులతో పాటు ఓ చిన్నారి బైక్ పై వేగంగా దూసుకుపోతున్నారు. బైక్ సైలెన్సర్ పై ఉన్న సంచికి మంటలు అంటుకున్నాయి. దీన్ని హైవేపై ఉన్న పోలీసులు గమనించి తమ వాహనంతో ఛేజ్ చేసి వారి ప్రాణాలను కాపాడారు. బైక్ కు అంటుకున్న మంటలను ఆర్పివేశారు. ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పెను ప్రమాదం నుంచి వారిని కాపాడిన పోలీసులపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఉత్తరప్రదేశ్‌ పోలీసులు పోస్ట్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.