ఒకే లైట్..ఒకే ఫ్యాన్.. బిల్ మాత్రం 128 కోట్లు

ఒకే లైట్..ఒకే ఫ్యాన్.. బిల్ మాత్రం 128 కోట్లు

ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అప్పుడప్పుడు పొరపాట్లు చేయడం మనం చూస్తూనే ఉంటాం.  ఒకరి బిల్ ఇంకొకరికి ఇవ్వడమో, బిల్ చెల్లించినా పవర్ కట్ చేయడమో, వందల రూపాయల్లో కరెంట్ వాడితే వేళలో బిల్ వేయడమో చూసుంటాం.  కానీ ఏకంగా 128 కోట్ల రూపాయలతో తప్పుడు బిల్ పంపి వృద్ధ దంపతుల్ని బెంబేలెత్తించారు యూపీ ఎలక్ట్రిసిటీ బోర్డ్ అధికారులు. 

హపుర్ నగరంలోని ఛార్మి గ్రామంలో షమీమ్ అతని భార్య ఒక చిన్న ఇంట్లో నివసిస్తున్నారు.  ఆ వృద్ధ దంపతులు వాడేది కేవలం ఒక లైట్, ఒక ఫ్యాన్ మాత్రమే.  అయినా వారికి 128 కోట్ల రూపాయల మేర బిల్ వచ్చింది.  ఆ మొత్తం చెల్లించనందుకు కరెంట్ కూడా కట్ చేశారు.  బిల్ చూసి ఖంగుతిన్న షమీమ్ నేరుగా వెళ్లి విద్యుత్ శాఖ అధికారుల్ని కలిసి మొరపెట్టుకోగా వారు సైతం మీకు వచ్చిన 128 కోట్ల బిల్లును కడితేనే కరెంట్ ఇస్తామన్నారట.  చివరికి ఎలాగో విషయం  తెలుసుకున్న అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ పోరాపాటు జరిగిందని ఒప్పుకుని సరిచేస్తామని మాటిచ్చారట.