కోర్టు సంచలన తీర్పు: భర్తకు భరణం చెల్లించాలని భార్యకు ఆదేశం...
సాధారణంగా భార్యాభర్తలు విడిపోయిన తరువాత భర్త నుంచి భార్య భరణం కోరుతుంది. భార్యకు భరణం చెల్లించాలని కోర్టులు తీర్పులు ఇస్తుంటాయి. కానీ, ఉత్తరప్రదేశ్ లో ఓ ఫ్యామిలీ కోర్టు భరణం విషయంలో సంచలన తీర్పు ఇచ్చింది. భార్య భర్తలు విడిపోయిన తరువాత తనకు భరణం ఇవ్వాలని ఓ భర్త కోర్టుకు వెళ్ళాడు. భర్తకు ఎలాంటి సంపాదన లేదు. భార్య ప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైర్డ్ అయ్యి ప్రతినెలా రూ.12000 పింఛన్ అందుకుంటోంది. భర్తకు భరణం కింద ప్రతినెలా వెయ్యి రూపాయల భరణం ఇవ్వాలని కోర్టు తీర్పు ఇచ్చింది. 2013లో భర్త తనకు భరణం ఇప్పించాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హిందూ వివాహ చట్టం 1995 ప్రకారం తనకు భరణం ఇప్పించాలని కోర్టును కోరాడు. దీనిపై సుదీర్ఘ విచారణలు జరిగిపిన కోర్టు ఇటీవలే తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు ప్రస్తుతం దేశంలో హాట్ టాపిక్ గా మారింది.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)