పెద్దాయన గురకపెడుతున్నాడని... దారుణంగా చంపేశాడు... 

పెద్దాయన గురకపెడుతున్నాడని... దారుణంగా చంపేశాడు... 

కొంతమంది వ్యక్తులు నిద్రపోయే సమయంలో తెలియకుండా గురక పెడుతుంటారు.  ఇది సహజం.  ఎంత కంట్రోల్ చేసుకున్నా దాని నుంచి బయటపడటం చాలా కష్టం. ఇలా గురకపెట్టే వారిని హెచ్చరిస్తే సరిపోతుంది.  కానీ, ఓ వ్యక్తి ఏకంగా కర్రతో బుర్రపగిలేలా కొట్టాడు.  దీంతో అయన అక్కడికక్కడేచనిపోయాడు.  ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ లోని ఫిలిబిత్ లో జరిగింది.  

ఫిలిబిత్ కు చెందిన 65 ఏళ్ల రామ్ స్వరూప్ అనే వ్యక్తి నిద్రలో గురపెట్టడం అలవాటుగా మారింది.  ఎంత ప్రయత్నం చేసినా ఆ గురక తగ్గడం లేదు.  ఎప్పటిలాగే నిద్రపోతున్న సమయంలో గురకపెడుతుండగా, అయన కొడుకు నవీన్ కోపంతో కర్ర తీసుకొని తండ్రి తల పగలగొట్టాడు.  దెబ్బ బలంగా తగలడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు తండ్రి.  వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు.  కానీ అప్పటికే రామ్ స్వరూప్ మరణించినట్టు వైద్యులు తెలిపారు.  దీంతో నవీన్ తమ్ముడు మనోజ్ ఫిర్యాదు మేరకు పోలీసులు నవీన్ ను అదుపులోకి తీసుకున్నారు.