12 గంటల వరకు 25 శాతం పోలింగ్..

12 గంటల వరకు 25 శాతం పోలింగ్..

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా.. ఆరో దశ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది... ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 5 గంటలకు వరకు కొనసాగనుండగా... కొన్ని సమస్యాత్యక ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ నిర్వహించనున్నారు. ఆరో విడతలో ఏడు రాష్ట్రాల్లోని 59 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగుతుండగా.. ఈ ఎన్నికల్లో మధ్యామ్నం 12 గంటల వరకు మొత్తంగా 25.06 శాతం ఓటింగ్ నమోదైంది. 
రాష్ట్రాల వారీగా ఇప్పటి వరకు నమోదైన ఓటింగ్
1. బీహార్‌లో 20.70 శాతం
2. హర్యానాలో 23.24 శాతం
3. మధ్యప్రదేశ్‌లో 28.01 శాతం
4. ఉత్తరప్రదేశ్‌లో 21.75 శాతం
5. పశ్చిమ బెంగాలో 38.08 శాతం
6. జార్ఖండ్‌లో 31.27 శాతం
7. ఢిల్లీలో 20.01 శాతం