సెక్యూలర్‌ డెమొక్రటిక్‌ ఫ్రంట్‌ ఏర్పాటు?

సెక్యూలర్‌ డెమొక్రటిక్‌ ఫ్రంట్‌ ఏర్పాటు?

కొత్త ఫ్రంట్‌ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశాలు లేనందున యూపీఎ పక్షాలతోపాటు మిగిలిన పార్టీలు కలిసి కొత్త ఫ్రంట్‌ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ప్రస్తుతానికి ఆ ఫ్రంట్‌కు సెక్యూలర్‌ డెమొక్రటిక్‌ ఫ్రంట్‌ అని పేరు పెట్టాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో ఎన్డీఏకు స్పష్టమైన మెజారిటీ రాదని విపక్ష నేతలు భావిస్తున్నారు. దీంతో యూపీఏలోని ఆరు పార్టీలతో పాటు తెలుగుదేశం, తృణమూల్‌ కాంగ్రెస్‌, బహుజన సమాజ్, సమాజ్‌వాదీ పార్టీ, ఆమ్‌ ఆద్మీ పార్టీతో పాటు వామపక్షాలు కలిసి ఈ కొత్త ఫ్రంట్‌ ఏర్పాటు చేయాలని భావిస్తున్నాయి.