ఉపాసన ప్రశ్నకు మెగాస్టార్ ఏం సమాధానం చెప్పారో తెలుసా ?

ఉపాసన ప్రశ్నకు మెగాస్టార్ ఏం సమాధానం చెప్పారో తెలుసా ?

మెగాస్టార్ చిరంజీవి సైరా సినిమా బిజీలో ఉన్నారు. షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ చేసుకుంది.  పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీ అయ్యారు.  విజువల్ వండర్ గా సినిమాను తీర్చిదిద్దెందుకు యూనిట్ ప్రయత్నాలు మొదలుపెట్టింది.  సైరా కోసం ప్రపంచంలోని 23 విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీలు పనిచేస్తున్నాయి.  విజువల్ విషయంలో రాజీపడే సమస్యలేదని నిర్మాత రామ్ చరణ్ అంటున్నాడు.  

ఈ సినిమా విషయంలో ఉపాసనకు ఓ డౌట్ వచ్చింది.  సైరా సినిమాను ఎందుకు చూడాలని ఉపాసన మెగాస్టార్ చిరంజీవిని ప్రశ్నించిందట.  సైరా అడిగిన ప్రశ్నకు మెగాస్టార్ అదిరిపోయే సమాధానం ఇచ్చాడు.  భారతీయులు ఇప్పుడు స్వేచ్చా వాయువులు పీల్చుకుంటూ..ఆనందంగా జీవిస్తున్నారంటే దాని వెనుక ఎందరో త్యాగమూర్తులు ఉన్నారని, వారి త్యాగం ఫలితంగానే దేశానికి స్వాతంత్రం వచ్చిందని అన్నారు. అలాంటి త్యాగమూర్తుల్లో ఒకరు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి.  అయన గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి.  అయన చేసిన పోరాటం గురించి అందరికి తెలియాలి.  అందరికి అర్ధమయ్యే రీతిలో చెప్పగలిగేది సినిమా ఒక్కటే.. చెప్పే విధానం బాగుంటే ప్రజలు అలాంటి వ్యక్తి గురించి తప్పకుండాఆ తెలుసుకుంటారు.. వారి కథను గురించి వింటే రోమాలు నిక్కబొడుచుకుంటాయి..అని ఉపాసనకు మెగాస్టార్ వివరణ ఇచ్చారట.