‘ఆచార్య’ షూటింగ్ సెట్స్‌కి ఉపాసన

‘ఆచార్య’ షూటింగ్ సెట్స్‌కి ఉపాసన

మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ సినిమాపై అంచనాలు రోజురోజుకు తారా స్థాయికి చేరిపోతున్నాయి. ఇక సినిమాలో రామ్ చరణ్ ఒక ముఖ్యమైన పాత్రలో మెగాస్టార్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న విషయం తెలిసిందే. రామ్ చరణ్ సిద్దా అనే స్టూడెంట్ యూనియన్ లీడర్ గా కనిపించబోతున్నాడు. ఇక రామ్ చరణ్, మెగాస్టార్ ఒకే ఫ్రేమ్ లో కనిపించే సీన్స్ ని దర్శకుడు కొరటాల ప్రత్యేకంగా తీర్చిదిద్దుతున్నాడు. ప్రస్తుతం ఆచార్య రాజమండ్రిలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. తాజాగా చరణ్ సతీమణి ఉపాసన ఆచార్య సినిమా షూటింగ్ సెట్స్ కు వెళ్లేందుకు రాజమండ్రి చేరుకుంది. తాజాగా ఆమె రాజమండ్రి ఎయిర్ పోర్ట్ లో కనిపించిన ఫోటోలు వైరల్ గా మారాయి. మే 14 ఆచార్య ప్రేక్షకుల ముందుకు రానుంది.