పవన్ ఆ సినిమాలో చేయట్లేదట..

పవన్ ఆ సినిమాలో చేయట్లేదట..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ మల్టీస్టారర్ సినిమాలో నటిస్తున్నాడని వార్తలు వచ్చాయి. మలయాళంలో సూపర్ హిట్ చిత్రంగా నిలిచిన అయ్యప్పన్నుమ్ కొషియుమ్ ప్రాజెక్టును తెలుగులో రీమేక్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈసినిమాలో పవన్ కళ్యాణ్ తో పాటు రానా కూడా నటిస్తున్నాడని వార్తలు వచ్చాయి. అయితే మొదట ఈ సినిమాలో మాస్ మ‌హరాజ్ రవితేజ, రానా కలిసి నటించనున్నట్లు దీనికి సాగర్‌ చంద్ర దర్శకత్వం వహించనున్నట్లు పుకార్లు వచ్చిన విషయం తెలిసిందే. త్వరలోనే అఫిషియ‌ల్ ప్ర‌క‌ట‌న‌ వెలువడే అవకాశం ఉంది అన్నారు. కానీ రవితేజ తన వరుస సినిమాలు ప్రకటించడంతో ఆ వార్తలు నిలిచిపోయాయి. తర్వాత మళ్ళీ ఈ సినిమాలో పవన్ ఆసక్తి చూపించాడు.. అందుకే పవన్ ను చిత్రబృందం కలిసిందని, ఇప్పటికే ఈ రీమేక్ లో నటించడానికి పవన్ కూడా ఒప్పుకున్నాడని రీసెంట్ గా వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో చేయడం లేదు అని తెలుస్తుంది. ఇప్పటికే పవన్ ప్రకటించిన సినిమాలు అన్ని పూర్తిచేసి ఈ సినిమా వరకు వచ్చే వరకు చాలా సమయం పడుతుందని... తన కోసం సినిమా ఆలస్యం కావడం ఇష్టం లేక ఈ సినిమా నుండి పవన్  తప్పుకున్నట్లు సమాచారం.