ప్రభాస్‌ ఫ్యాన్స్‌ కు గుడ్‌ న్యూస్‌..

ప్రభాస్‌ ఫ్యాన్స్‌ కు గుడ్‌ న్యూస్‌..

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పాన్ ఇండియా రేంజ్‌లో ప్రతిష్ఠీత్మకంగా తెరకెక్కుతున్న సినిమా రాధేశ్యామ్. ఈ సినిమా కోసం ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంతో రూపొందిస్తున్నాడు. రాధేశ్యామ్ సినిమా పోస్టర్ ఒక్కొక్కటీ విడుదల అవుతున్న కొద్దీ ఆ సినిమాపై అంచనాలు కూడా తారాస్థాయిని మించి పోతున్నాయి. ఈ సినిమా ఓ పిరియాడికల్ లవ్ డ్రామాగా తెరకెక్కతోంది. అంతేకాకుండా లాక్‌డౌన్ ముందే యూరప్ చిత్రీకరణ ముగించుకొని వచ్చేసింది. ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకులను మెప్పిస్తుందని మేకర్స్ నమ్మకంగా చెబుతున్నారు. ఇందులో టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ నటీనటులు కూడా ఉన్నారు. దాంతో ఈ సినిమా ఐదు భాషల్లో రిలీజ్ కానుంది. అయితే..  ఈ సినిమా ట్రైలర్‌ కోసం ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇందుకు సంబంధించి వరుస ట్వీట్స్‌ కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మూవీ డైరెక్టర్‌ రాధాకృష్ణ కుమార్‌ తన ట్విట్టర్‌ ద్వారా క్లారిటీ ఇచ్చారు. టీజర్‌ అప్‌డేట్ త్వరలోనే రానుంది. కాస్త ఓపికతో ఉండండి. మీ ఓపికకు తగ్గ ప్రతిఫలం దక్కేలా టీజర్‌ ఉంటుందని నేను ప్రామిస్‌ చేస్తున్నాను అని రాధాకృష్ణకుమార్‌ తన ట్వీట్‌లో రాసుకొచ్చారు. అయితే.. ఈ టీజర్‌ ఉగాది కానుకగా వచ్చే అవకాశాలున్నాయని టాక్‌ నడుస్తోంది.