ఈ వారంలో చరణ్ సందడి చేయోచ్చు !

ఈ వారంలో చరణ్ సందడి చేయోచ్చు  !

సినిమా మొదలుపెట్టి సగం వరకు షూటింగ్ ముగిసినా రామ్ చరణ్ టీమ్ నుండి ఇంకా ఎలాంటి అప్డేట్ బయటకురాలేదు.  ఇదివరకే టీజర్, ఫస్ట్ లుక్ లాంటివి వస్తాయని వార్తలు వచ్చినా ఏవీ నిజం కాలేదు.  కానీ ఈ వారం మాత్రం సినిమా నుండి ఒక అప్డేట్ ఖచ్చితంగా ఉంటుందని తెలుస్తోంది. 

శుక్రవారం లేదా శనివారాల్లో ఈ అప్డేట్ ఉండొచ్చట.  మరి ఈ అప్డేట్ ఫస్ట్ లుక్ పై ఉంటుందా టైటిల్ పై ఉంటుందా అనేది తెలియాల్సి ఉంది.  మాస్ పల్స్ బాగా తెలిసిన బోయపాటి ఈ చిత్రాన్ని ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిస్తున్నారు.  కైరా అద్వానీ కథానాయకిగా నటిస్తున్న ఈ సినిమాను డివివి దానయ్య నిర్మిస్తున్నారు.