మహేష్ సినిమాకి నో చెప్పిన ఉపేంద్ర !

మహేష్ సినిమాకి నో చెప్పిన ఉపేంద్ర !

 

కన్నడ హీరో ఉపేంద్రకు తెలుగునాట కూడ మంచి ఫాలోయింగ్ ఉంది.  తరచూ ఆయన సినిమాలు తెలుగులోకి డబ్ అవుతూనే ఉంటాయి.  ఆయన కొత్త సినిమా 'ఐలవ్యూ' కూడా త్వరలో తెలుగులో రిలీజ్ కానుంది.  తాజాగా ఈ సినిమా ప్రమోషన్లో పాల్గొన్న ఆయన మహేష్, అనిల్ రావిపూడి సినిమాలో మీకు నటించే ఛాన్స్ వచ్చిందట కదా అనే ప్రశ్నకు అవునని జవాబిచ్చారు.  కానీ తాను  నో చెప్పినట్టు కూడా తెలిపారు.  ఆ సినిమాలో నటించాలని ఉన్నా డేట్స్ కుదరక తాను నో చెప్పానని, మంచి పాత్రలు వచ్చి, డేట్స్ కుదిరితే తెలుగు సినిమాల్లో నటించడానికి ఎలాంటి అభ్యంతరమూ లేదని అన్నారు.