రిటైల్ ఇన్వెస్టర్లకు ముఖ్య గమనిక 

రిటైల్ ఇన్వెస్టర్లకు ముఖ్య గమనిక 

ఇకపై రిటైల్‌ ఇన్వెస్టర్లు పబ్లిక్‌ ఇష్యూలకు యూపీఐ (యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌) ద్వారానే దరఖాస్తు చేస్తుకోవాల్సి ఉంటుంది. యూపీఐ ఆధారిత యాస్బా (అప్లికేషన్‌ సపోర్టెడ్‌ బై బ్లాక్‌డ్‌ అమౌంట్‌) ద్వారానే పబ్లిక్‌ ఇష్యూలకు దరఖాస్తులను స్వీకరిస్తామని నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) కీలక ప్రకటన చేసింది. ఈ నెల 29 నుంచి ఈ కొత్త విధానం అమల్లోకి వచ్చినట్లు ఎన్‌పీసీఐ వెల్లడించింది.  ప్రస్తుతం  ఐపీఓ ముగింపు తేదీ నుంచి ఆరు రోజుల్లో మొత్తం ప్రక్రియను పూర్తవుతుంది. యూపీఐ ద్వారానైనే కేవలం మూడు రోజుల్లోనే ముగుస్తుందని ఎన్‌పీసీఐ తెలిపింది. రిటైల్ ఇన్వెస్టర్లు, బ్రోకర్లు, డీపీలు, ఆర్‌టీఏల ద్వారా కొనుగోలు చేసే అన్ని రిటైల్ ఐపీవో ఇన్వెస్టర్లకు ఇది వర్తించనుంది.