తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభమైన సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష...

తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభమైన సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష...

తెలుగు రాష్ట్రాల్లో యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష ప్రారంభమైంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 9.30 నుంచి 11.30 వరకు పేపర్ -1 పరీక్ష జరగనుండగా... మధ్యాహ్నం 2.30  నుంచి సాయంత్రం 4.30 వరకు పేపర్-2 పరీక్ష నిర్వహిస్తారు.  దేశవ్యాప్తంగా మొత్తం 72 పట్టణాల్లో సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షలు జరుగుతున్నాయి.  తెలంగాణలోని హైదరాబాద్‌, వరంగల్‌లో పరీక్ష నిర్వహిస్తున్నారు. ఇందుకోసం మొత్తం 115 సెంటర్లు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ 99, వరంగల్‌లో 16 కేంద్రాల్లో పరీక్షలు జరుగుతున్నాయి. హైదరాబాద్‌లో 46వేల 171 మంది వరంగల్‌ కేంద్రాల్లో 6,763 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. అటు  ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు అధికారులు. ఏపీలో మొత్తం 68 పరీక్ష కేంద్రాను ఏర్పాటు చేశారు.  విద్యార్థులకు మాస్క్ లు ఉంటేనే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతి ఇస్తున్నారు.