యూరి టీమ్ నుంచి మరో సినిమా

యూరి టీమ్ నుంచి మరో సినిమా

ఇండియన్ ఆర్మీ సర్జికల్ స్ట్రైక్స్ ఆధారంగా యూరి సినిమా వచ్చింది.  ఈ సినిమా బాలీవుడ్ లో భారీ వసూళ్లు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.  రిలీజైన ప్రతి చోట ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు.  బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటించగా.. యామి గౌతమ్ తదితరులు ముఖ్యపాత్రల్లో కనిపించారు.  

ఇండియా పై పాక్ ఉగ్రవాదులు చేసిన దాడికి ప్రతీకారంగా ఇండియన్ ఆర్మీ పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో సీక్రెట్ దాడులు నిర్వహించింది.  యూరి సినిమా తరువాత ఈ టీమ్ మరో సినిమా చేసేందుకు సిద్ధం అయ్యింది.  చారిత్రాత్మక యుద్ధం నేపథ్యంలో సినిమాను తెరకెక్కించబోతున్నారు.  టైటిల్ ఇంకా ప్రకటించలేదు.  వచ్చే ఏడాదిలో సినిమా ప్రారంభం అవుతుంది.