కాంగ్రెస్ పార్టీకి వర్మ హీరోయిన్ రాజీనామా..!!

కాంగ్రెస్ పార్టీకి వర్మ హీరోయిన్ రాజీనామా..!!

సార్వత్రిక ఎన్నికలకు ముందు మార్చి నెలలో బాలీవుడ్ నటి ఊర్మిళ కాంగ్రెస్ పార్టీలో చేరింది.  కాంగ్రెస్ లో చేరిన ఆమెకు ముంబై నార్త్ నియోజక వర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఇచ్చింది కాంగ్రెస్.  కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన ఊర్మిళ బీజేపీ అభ్యర్థి గోకుల్ శెట్టి చేతిలో దాదాపు 4 లక్షల ఓట్లతో ఓడిపోయారు.  అనంతరం ఆమె కొంతకాలం కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు.  అయితే, కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలు హెచ్చు మీరిపోతున్నాయని, స్వార్ధప్రయోజనాల కోసం పార్టీని వాడుకుంటున్నారని చెప్పి ఆమె పార్టీకి రాజీనామా చేసింది.  

ఊర్మిళ అనగానే టక్కున గుర్తుకు వచ్చే సినిమా రంగీలా.  ఈ సినిమాతో బాలీవుడ్ పాపులర్ అయ్యింది.  వర్మ గర్ల్ గా పేరు తెచ్చుకుంది. ఆ తరువాత సత్య, అంతం, గాయం, అనగనగా ఒకరోజు ఇలా ఎన్నో సినిమాలతో తెలుగులో పేరు తెచ్చుకుంది.  రాజీనామా తరువాత మరో పార్టీలో చేరుతుందా లేదంటే రాజకీయాలను పక్కన పెట్టి తిరిగి సినిమాల్లో బిజీ అవుతుందా అన్నది తెలియాలి.