అర్జెంటీనా దారిలోనే పోర్చుగల్‌

అర్జెంటీనా దారిలోనే పోర్చుగల్‌

ఫిఫా ప్రపంచకప్‌లో అర్జెంటీనా దారిలోనే పోర్చుగల్‌ నడిచింది. ఎన్నో అంచనాల నడుమ సాకర్‌ సమరంలో అడుగుపెట్టిన పోర్చుగల్‌ కథ ప్రిక్వార్టర్స్‌లోనే ముగిసింది. శనివారం ఉత్కంఠభరితంగా సాగిన రెండో నాకౌట్‌ పోరులొ ఉరుగ్వే 2-1తో పోర్చుగల్‌పై ఘన విజయం సాధించింది. తొలి క్వార్టర్‌ ఫైనల్‌లో జులై 6న ఫ్రాన్స్‌తో  తలపడనుంది. మ్యాచ్‌ ప్రారంభమైన 7వ నిమిషంలో పోర్చుగల్‌ ఆటగాడు సువారెజ్‌ ఇచ్చిన పాస్‌ను ఉరుగ్వే ఫార్వర్డ్‌ ప్లేయర్‌ ఎడిన్సన్‌ కావనీ హెడర్‌ గోల్‌ చేసి ఉరుగ్వేకు తొలి గోల్‌ అందించాడు. అనంతంరం ఫ్రికిక్‌ రూపంలో వచ్చిన అవకాశాన్ని స్టార్ ప్లేయర్ రొనాల్డో మిస్‌ చేశాడు. ఇరు జట్లు మరో గోల్‌ చేయడానికి ప్రయత్నించినా గోల్ చేయలేకపోయాయి. దీంతో తొలి భాగం ముగిసేసరికి 1-0తో ఉరుగ్వే ఆధిక్యంలో ఉంది.

ఇక మలి భాగంలో జోరు పెంచిన పోర్చుగల్‌ జట్టుకు 55వ నిమిషంలో రొనాల్డో ఇచ్చిన పాస్‌తో డిఫెండర్‌ పెపె గోల్‌ చేయడంతో ఇరు జట్ల స్కోర్‌ 1-1తో సమం అయింది. పోర్చుగల్‌ డిఫెండింగ్‌ వైఫల్యంతో ఎడిన్సన్‌ కావనీ మరో అద్భుతమైన గోల్‌ చేయడంతో ఉరుగ్వే 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇరు జట్లు మరో గోల్‌ కోసం పోటీపడినా  లాభం లేకపోయింది. ఇక ఎక్సట్రా ఇంజ్యూరీ టైమ్‌లో కూడా మరో గోల్‌ నమోదు చేయలేకపోయిన పోర్చుగల్‌ ఓటమితో టోర్నీ నుండి నిష్క్రమించింది. ఉరుగ్వే ప్లేయ‌ర్ ఎడిస‌న్ క‌వానీ రెండు గోల్స్ చేసి జ‌ట్టు విజ‌యంలో కీల‌క పాత్ర పోషించాడు. గ్రూప్ స్టేజ్‌లో నాలుగు గోల్స్ చేసి పోర్చుగ‌ల్‌ను ముందుకు న‌డిపించిన రోనాల్డో.. కీల‌కమైన నాకౌట్ మ్యాచ్‌లో తేలిపోయాడు.