సిరియాపై అమెరికా వైమానిక దాడి... 17 మంది మృతి

సిరియాపై అమెరికా వైమానిక దాడి... 17 మంది మృతి

సిరియాలోని ఉగ్రవాదుల శిబిరాలను లక్ష్యంగా చేసుకొని అమెరికా యుద్ధ విమానాలు దాడులు చేశాయి.  పెద్ద ఎత్తున జరిగిన ఈ దాడుల్లో 17 మంది ఉగ్రవాదులు మృతి చెందారని అమెరికా పేర్కొన్నది.  సిరియా-ఇరాక్ సరిహద్దుల్లో ఉన్న ఉగ్రవాదులే లక్ష్యంగా చేసుకొని ఈ దాడులు చేసింది అమెరికా.  ఇరాన్ ప్రోద్బలంతో సిరియాలో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారని అమెరికా ఆరోపణలు చేస్తున్నది.  అమెరికా నూతన అధ్యక్షుడిగా జో బైడెన్ అధికారంలోకి వచ్చిన 36 రోజుల్లోనే ఈ దాడులకు అనుమతులు ఇవ్వడం గమనార్హం. అమెరికన్లకు, సిబ్బంది రక్షణకు ఎలాంటి చర్యలకైనా జో బైడెన్ వెనకాడబోరని ఈ దాడుల ద్వారా స్పష్టం అయ్యింది.