అమెరికాలో కేన్సర్ మరణాలు తగ్గుముఖం

అమెరికాలో కేన్సర్ మరణాలు తగ్గుముఖం

అమెరికాలో కేన్సర్ మరణాల తగ్గుముఖం పట్టాయి. 25 ఏళ్లుగా కేన్సర్ మృతుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. పొగ తాగేవారి సంఖ్య తగ్గడంతో కేన్సర్ మరణాలు తగ్గుముఖం పట్టాయి. ఇదే కాకుండా ప్రాథమిక దశలోనే గుర్తించే సౌకర్యాలు పెరగడం, చికిత్స విధానాలు మెరుగవడం కారణంగా కేన్సర్ మృతుల సంఖ్య బాగా తగ్గాయని నిపుణులు చెబుతున్నారు. దీని వెనుకే ఓ చేదు నిజం కూడా బయటపడింది. ఊబకాయ సంబంధిత కేన్సర్ మరణాలు పెరుగుతున్నాయి. ప్రొస్టేట్ కేన్సర్ చావులు  ఎంత మాత్రం తగ్గడం లేదని మంగళవారం వెల్లడించిన అమెరికన్ కేన్సర్ సొసైటీ రిపోర్ట్ పేర్కొంది.

అమెరికాలో ప్రాణాలు తీసే వ్యాధుల్లో కేన్సర్ 2 స్థానంలో ఉంది. ఈ ఏడాది అమెరికాలో 1.7 మిలియన్లకు పైగా కొత్త కేన్సర్ కేసులు వస్తాయని, 6,00,000కి పైగా కేన్సర్ మరణాలు సంభవిస్తాయని సొసైటీ అంచనా వేసింది. ఇక రిపోర్ట్ పూర్తి స్థాయి విశ్లేషణ ఇలా ఉంది.

తగ్గుముఖం
అమెరికాలో మరణాల రేటు గురించి ఆందోళన వ్యక్తమైంది. 2017లో ప్రమాదాలలో గాయపడినవారు 10 మందికి ఏడుగురు మరణించినట్టు ప్రభుత్వం విడుదల చేసిన డేటా స్పష్టం చేసింది. కానీ కేన్సర్ విషయంలో ఇది ఆశాజనకంగా ఉంది. 1990ల ప్రారంభం వరకు అమెరికాలో కేన్సర్ మరణాల రేటు పెరుగుతూ వచ్చింది. కానీ అది 1991-2016 మధ్య 27%కి తగ్గిందని కేన్సర్ సొసైటీ తెలిపింది. కేన్సర్లలో ఊపిరితిత్తుల కేన్సర్ ప్రమాదకారిగా మారింది. ఎంతో కాలం ఎందరినో ముఖ్యంగా పురుషులను ఈ కేన్సర్ బలిగొంది. కానీ 1991 నుంచి పురుషుల్లో లంగ్ కేన్సర్ మరణాల రేటు దాదాపుగా 50% తగ్గింది.

ప్రొస్టేట్ కేన్సర్
పురుషుల కేన్సర్ మరణాల్లో రెండో స్థానం ప్రొస్టేట్ కేన్సర్ ది. గత రెండు దశాబ్దాలలో ప్రొస్టేట్ కేన్సర్ మరణాల రేటు సగం తగ్గింది. ప్రొస్టేట్ కేన్సర్ మరణాల రేటు 2013-16 వరకు నేలబారుగా ఉంది. పురుషులు పీఎస్ఏ బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలని సిఫార్సు చేయడాన్ని ఆపేయాలని 2011లో యుఎస్ ప్రివెంటివ్ సర్వీసెస్ టాస్క్ ఫోర్స్ నిర్ణయించిన తర్వాతే ఇది చోటు చేసుకోవడంపై నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పీఎస్ఏ బ్లడ్ టెస్ట్ కారణంగా ఎక్కువ పరీక్షలు, ఎక్కువ మోతాదులో చికిత్స చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తం కావడంతో ప్రివెంటివ్ సర్వీసెస్ టాస్క్ ఫోర్స్ ఆ నిర్ణయం తీసుకొంది. 

ఊబకాయం
అమెరికాలో అత్యంత సాధారణంగా కనిపించే కేన్సర్ లలో ఊబకాయం ఒకటి. పెరుగుతున్న మరణాల రేటుకి ఊబకాయమే కారణమని చెబుతున్నారు. క్లోమగ్రంథి కేన్సర్, గర్భాశయ కేన్సర్ మరణాలను కూడా ఊబకాయ కేన్సర్ కి ముడిపెడుతున్నారు. 

1970ల నుంచి కాలేయ కేన్సర్ మరణాలు పెరుగుతున్నాయి. ఈ చావుల్లో పెరుగుదలను మొదట మత్తుపదార్థాలు వినియోగించే వారిలో వ్యాపించే హెపటైటిస్ సి ఇన్ఫెక్షన్లే కారణమని భావించారు. కానీ ఇప్పుడు కాలేయ కేన్సర్ మరణాల్లో మూడో వంతు చావులకు ఊబకాయమే కారణమని చెబుతున్నారు. 

1990లలోనే దేశంలో పెరుగుతున్న ఊబకాయ వ్యాధిని పెద్ద సమస్యగా గుర్తించారు. అయితే ఇది కేన్సర్ ను ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకొనేందుకు దశాబ్దాలు పట్టవచ్చు. 

అసమానత్వం
కేన్సర్ మరణాల రేటులో చారిత్రక జాతుల మధ్య భేదం తగ్గింది. కానీ ఆర్థిక తేడాలు మాత్రం పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రాథమిక పరీక్షలు, చికిత్స, మెరుగైన ఆహారం, పొగ తాగడం తగ్గించి మృత్యువును నివారించవచ్చు. 

1970ల ఆరంభంలో పెద్దప్రేగు కేన్సర్ మరణాల రేటు సంపన్న దేశాలతో పోలిస్తే నిరుపేద దేశాలలో 20% తక్కువగా ఉండేది. ఇప్పుడది 30% ఎక్కువైంది. ధనిక దేశాల మహిళలతో పోలిస్తే పేద దేశాలలోని మహిళల్లో గర్భాశయ కేన్సర్ మరణాలు రెట్టింపయ్యాయి. పేద దేశాల పురుషుల్లో ఊపిరితిత్తులు, కాలేయ కేన్సర్ మరణాల రేట్లు 40% ఎక్కువగా ఉన్నాయి.