వామ్మో.... రక్తం తాగి, మాంసం తినాలనే..

వామ్మో.... రక్తం తాగి, మాంసం తినాలనే..

మనుషులను చంపి, రక్తం తాగేందుకు ప్లాన్ చేసే వారిని మీరెప్పుడైనా చూశారా. ఎన్నడూ చూసి ఉండరు. మనుషుల రక్తం తాగడమేంటి అనుకుంటున్నారా అవును నిజమే.... అందుకే పక్కా ప్లాన్ చేశారు. అది కూడా  పది పన్నెండేళ్ల బాలికలు ఇంతటి దుస్సాహసానికి కుట్ర చేశారంటే మరో షాక్ కదా. ఇంకో విషయం ఏంటో తెలుసా సొంత క్లాస్ మేట్స్ నే చంపి రాక్తం తాగే ప్లాన్ చేశారు. ఈ కుట్ర అమెరికాలో జరిగింది.  కుట్రను పోలీసులు భగ్నం చేశారు. ప్లాన్ చేసిన ఆ బాలికలను అరెస్ట్ చేశారు. 

మధ్య ఫ్లోరిడాలోని ఇద్దరు స్కూల్ బాలికలు తమ క్లాస్ మెట్స్ ని చంపి రక్తం తాగి, ఆ తర్వాత వారి మాంసాన్ని కూడా తినాలనే ప్లాన్ చేశారు. ఆ ఇద్దరు బాలికల వయస్సు ఎంతో తెలుసా... కేవలం 11 ఏళ్లు, మరొకరికి 12 ఏళ్లు. క్లాస్ మేట్స్ ని చంపేందుకు వారిద్దరు కత్తులతో స్కూల్ వాష్ రూం లో దాక్కొని ఉన్నారు. ఎవరైనా వారి క్లాస్ మేట్స్ వాష్ రూంకి వస్తే వారిని చంపి రక్తం తాగి, మాంసం తినాలని కుట్ర చేశారు. అదే సమయంలో స్కూల్ ఫంక్షన్ జరుగుతోంది. ఆ సమయంలో తమ ప్లాన్ ఎవరికి తెలియదని భావించారు ఆ ఇద్దరు బాలికలు. ఈ విషయాన్ని తోటి విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఒకరు కనుగొని అనుమానంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు.  పోలీసులు ఈ కుట్రను భగ్నం చేశారు. తర్వాత వారిపై హత్య కుట్ర, స్కూల్ ఆవరణలోనే కత్తులు కలిగి ఉండటం లాంటి నేరాలపై కేసులు నమోదు చేశారు. ఆ ఇద్దరు బాలికలు సైతాన్ ఆరాధకులు అని పోలీసులు తెలిపారు. అంతేకాదు.. వారు తర్వాత ఆత్మహత్యా చేసుకోవాలనుకున్నారని పోలీసులు తెలిపారు.