నాసా స్పేస్‌ క్రాఫ్ట్‌కు కల్పనా చావ్లా పేరు.!

 నాసా స్పేస్‌ క్రాఫ్ట్‌కు కల్పనా చావ్లా పేరు.!

భారత దేశానికి అరుదైన గౌరవం దక్కింది. దివంగత నాసా వ్యోమగామి కల్పనా చావ్లా పేరును అమెరికన్‌ వాణిజ్య కార్గో అంతరిక్ష నౌకకు పెట్టాలని నిర్ణయించింది. అమెరికన్ గ్లోబల్ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ టెక్నాలజీ సంస్థ నార్త్రోప్ గ్రుమ్మన్ దాని తదుపరి సిగ్నస్‌ క్యాప్సూల్‌కు ‘ఎస్‌ఎస్‌  కల్పనా చావ్లా’ అని పేరు పెట్టనున్నట్లు ప్రకటించింది. ఇదిలా ఉండగా నాసాలో పనిచేస్తూ అంతరిక్షంలోకి అడుగుపెట్టిన తొలి భారత సంతతికి చెందిన మహిళగా కల్పనా చావ్లా నిలిచిపోయింది. 2003 లో ఆరుగురు సభ్యులతో ప్రయాణిస్తున్న కొలంబియా అనేక నౌక కుప్పకూలడంతో కల్పనా చావ్లా మరణించింది.