త్వరలోనే భారత్‌కు అమెరికా వెంటిలేటర్లు..

త్వరలోనే భారత్‌కు అమెరికా వెంటిలేటర్లు..

అమెరికా-చైనా మధ్య వాణిజ్య యుద్ధం నడుస్తున్న సమయంలో  భారత్‌-అమెరికా మధ్య సంబంధాల బలోపేతం కోసం అధ్యక్షుడు ట్రంప్‌ తీవ్రంగా శ్రమిస్తున్నారు...యూఎస్-చైనా ట్రేడ్ వార్‌లో భారత్‌ను అమెరికా వైపు నిలిపేందుకు ట్రంప్‌ శాయశక్తులుగా కృషి చేస్తున్నారు...
గతంలో కరోనా చికిత్సలో కీలకంగా మారిన వెంటిలేటర్లను భారత్‌కు సరఫరా చేస్తామని ట్రంప్‌ రెండు వారాల క్రితమే హామీ ఇచ్చారు...తాజా  భారత్‌కు విరాళంగా ఇస్తామన్న వెంటిలేటర్లలో కొన్నింటిని వచ్చేవారం పంపనున్నట్లు అమెరికా అధ్యక్ష భవనం వైట్‌ హౌస్‌  ప్రకటించింది...అమెరికా స్పందన పట్ల మోదీ అప్పట్లోనే కృతజ్ఞతలు తెలియజేశారు...నిన్న జరిగిన ఫోన్‌ సంభాషణలో అధ్యక్షుడు ట్రంప్‌ ప్రధాని మోదీకి ఈ విషయం చెప్పినట్టు సమాచారం..తొలి విడతలో భాగంగా దాదాపు 100 వెంటిలేటర్లు పంపనున్నట్లు పేర్కొంది.. భారత్‌కు సహాయం చేసే అవకాశం రావడం పట్ల ట్రంప్‌ సంతోషంగా ఉన్నారని అధికారులు తెలిపారు..ఈ నిర్ణయం ఇరుదేశాల స్నేహాన్ని మరింత బలోపేతం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు...గతంలో ట్రంప్ అభ్యర్థన మేరకు కరోనా చికిత్స నిమిత్తం భారత్ హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలను సరఫరా చేసిన సంగతి తెలిసిందే..