అమెరికా అధ్యక్షుడు తొలిట్వీట్...వైరల్ 

అమెరికా అధ్యక్షుడు తొలిట్వీట్...వైరల్ 

అమెరికా అధ్యక్ష పదవికి సంబంధించి ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి.  అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో డెమోక్రాట్ అభ్యర్థి జో బైడెన్ విజయం సాధించారు.  జో అధ్యక్షుడిగా గెలుపొందిన తరువాత వెంటనే జో అధ్యక్షుడిగా, కమలా హ్యారిస్ ఉపాధ్యక్షురాలిగా పేర్కొంటూ ట్విట్టర్ ప్రొఫైల్ ను ఛేంజ్ చేశారు.  అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తనను గెలిపించిన అమెరికన్లు అందరికి జో బైడెన్ కృతజ్ఞతలు తెలిపారు.  తనకు, ఓటు వేసినా, వేయని అందరికి తాను అధ్యక్షుడిగా ఉంటానని, తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని హామీ ఇస్తూ ట్వీట్ చేశారు.  ట్వీట్ తో పాటుగా అమెరికా డ్రీమ్స్ కి సంబంధించిన చిన్న వీడియోను షేర్ చేశారు.  ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది.  ఇప్పటికే ఆ వీడియోను దాదాపుగా 30 మిలియన్ల మందికి పైగా వీక్షించారు.