ఉసేన్ బోల్ట్ రికార్డ్ ను బద్దలు కొట్టిన మన కుర్రాడు

ఉసేన్ బోల్ట్ రికార్డ్ ను బద్దలు కొట్టిన మన కుర్రాడు

ఉసేన్ బోల్ట్ అనేది మనకి పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. పరుగుపోటీలో ఉసేన్ బోల్డ్ ను ఎవ్వరూ అధిగమించలేరన్న విషయం తెలిసిందే. చిరుత పులి వేగమా లేక బోల్ట్‌ వేగమా అంటే అతిశయోక్తి కాదు. మన పొరుగునే ఉన్న కర్ణాటక యువకుడొకరు ఆ వేగాన్ని బద్దలు కొట్టాడు. మంగుళూరు, ఉడిపి ప్రాంతాల్లో నిర్వహించే సంప్రదాయ ‘కంబాల’లో శ్రీనివాస గౌడ ఈ రికార్డును తిరగరాశాడు. దక్షిణ కన్నడ జిల్లాలోని మూడబిద్రికి చెందిన ఈ రేసర్‌ 13.62 సెకండ్లలో 142.50 మీటర్లు పరుగెత్తి ఉసేన్‌ బోల్ట్‌ (9.58 సెకండ్లలో 100 మీటర్లు) ప్రపంచ రికార్డును గుర్తు చేశాడు. 142.50 మీటర్ల దూరాన్ని 100 మీటర్లకు లెక్కించినపుడు గౌడ బోల్ట్ కన్నా 0.03 సెకండ్లు ముందంజలో ఉండటం విశేషం. రెండు దున్నపోతులతో పాటు పరుగెత్తే ఈ క్రీడను బురదమయమైన పంట పొలాల్లో నిర్వహిస్తారు. ఇక శ్రీనివాస గౌడ బోల్ట్‌ కన్నా వేగంగా పరెగెత్తుతున్నాడని సోషల్‌ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది.