హుజూర్‌నగర్‌లో ఓటమికి నాదే బాధ్యత...ఉత్తమ్ సంచలనం

హుజూర్‌నగర్‌లో ఓటమికి నాదే బాధ్యత...ఉత్తమ్ సంచలనం

హుజూర్ నగర్ ఓటమికి తనదే బాధ్యతన్నారు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశంలో ఉప ఎన్నికలో ఓటమి, క్రమశిక్షణ ఉల్లంఘన, సభ్యత్వ నమోదు, మున్నిసల్ ఎన్నికలపై నేతల మధ్య వాడీవేడీ చర్చ జరిగింది. పార్టీ తీరును సీనియర్ నేత వీహెచ్ తీవ్రంగా తప్పుబట్టారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రులెవరూ పదవి చేపట్టకముందు కార్యకర్తలతో సీఎం అని పిలుపించుకోలేదన్నారు వీహెచ్.

క్రమశిక్షణ ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కోర్ కమిటీ సమావేశానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర్ రాజనర్సింహ హాజరు కాలేదు. మరో సీనియర్ నేత జానారెడ్డి సమావేశం చివర్లో వచ్చారు. హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఓడిపోవడంతో పార్టీ క్యాడర్‌లో ఆత్మస్థైర్యం కొంత సన్నగిల్లిందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అభిప్రాయపడ్డారు. అయితే కాంగ్రెస్ పార్టీ తమ ఓటింగ్ ను ఈ నియోజకవర్గంలో నిలుపుకొనే ప్రయత్నం చేసిన విషయాన్నిఉత్తమ్ కుమార్ రెడ్డి గుర్తు చేశారు.