ఆంధ్ర ప్రాంతం వ్యక్తికి హుజూర్ నగర్ టికెట్ ఇచ్చారు !

ఆంధ్ర ప్రాంతం వ్యక్తికి హుజూర్ నగర్ టికెట్ ఇచ్చారు !

హుజూర్ నగర్ నియోజకవర్గ ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదలైన వెంటనే పార్టీల మధ్య విమర్శల యుద్ధం మొదలైంది. ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తికి టీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చిందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. హుజూర్ నగర్ అభివృద్ధి కోసం టీఆర్ఎస్ ఏం చేసిందో చెప్పాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ 30 వేల మెజార్టీతో గెలవడం ఖాయమని ఆయన అన్నారు. బంగారు తెలంగాణ చేస్తానని చెప్పిన కేసీఆర్ ఈ ఆరేళ్లలో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని మండిపడ్డారు.

హుజూర్ నగర్ లో కాంగ్రెస్ ను గెలిపించి కేసీఆర్ నియంతృత్వ పాలనకు చరమగీతం పలకాలని పిలుపునిచ్చారు. ఉప ఎన్నిక రాష్ట్రానికి మార్గదర్శకం కావాలని  కాంగ్రెసుకు ఓటేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. మరో పక్క హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ గెలుపు ఖాయమన్నారు ఆ టికెట్ దక్కించుకున్న సైదిరెడ్డి. ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్సేనని, అభివృద్ధిని అజెండాగా తీసుకెళ్తామని అంటున్నారు. ఉత్తమ్‌ను హుజుర్‌నగర్ నుంచి పంపించేందుకే.. నల్గొండ ఎంపీగా గెలిపించారని సైదిరెడ్డి చెబుతున్నారు.