కేసీఆర్ మాజీ అయిపోయాడు

కేసీఆర్ మాజీ అయిపోయాడు

కేసీఆర్ మాజీ సీఎం అయిపోయారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎద్దేవా చేశారు. దోచుకున్న డబ్బుతో ఎన్నికలను ప్రభావితం చేయాలని కేసీఆర్ చూస్తున్నారని ఆరోపించారు. చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి కొత్త అంశాలను తెరమీదకు తెస్తున్నారని అన్నారు. మాజీ కాబోతున్న కేసీఆర్... డబ్బులు ఇచ్చి సభలకు జనాలను తీసుకువస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ ఫాంహౌస్ కు, కేటీఆర్ అమెరికాకు వెళ్లాలని సూచించారు. ఈ నెల 23న సోనియా గాంధీ, కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనకు వస్తున్నారని తెలిపారు. సాయంత్రం మేడ్చల్ లో జరిగే బహిరంగ సభలో సోనియా గాంధీ ప్రసంగిస్తారని చెప్పారు. ఈ 15 రోజులు కార్యకర్తలందరు కష్టపడి పనిచేసి కూటమి అభ్యర్దులను గెలిపించాలని సూచించారు. మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా నాకు ఫోన్ చేయండి. భద్రాచలం నుంచి గద్వాల వరకు.. ఆదిలాబాద్ నుంచి కోదాడ వరకు ప్రతి ఒక్కరు సభకు తరలిరావాలని అందరిని ఆహ్వానిస్తున్నా. ఈ సభ ద్వారా తెలంగాణ రాజకీయాల్లో కీలకమార్పులు జరుగుతాయని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.