నాగార్జునసాగర్ లో బీజేపీకి డిపాజిట్ గల్లంతు

నాగార్జునసాగర్ లో బీజేపీకి డిపాజిట్ గల్లంతు

ఉత్తమ్‌ కుమార్ రెడ్డి బీజేపీ, టీఆర్‌ఎస్‌లపై సంచలన వ్యాఖ్యలు చేశారు.  కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్పొరేట్లకు వత్తాసు పలుకుతోందని.. రైతు వ్యతిరేక చట్టాలను తీసుకు వచ్చి రైతాంగాన్ని నాశనం చేస్తోందని మండిపడ్డారు. కెసిఆర్ దుర్మార్గ దౌర్భాగ్య పాలన చేస్తున్నాడని..కేసీఆర్ ఈ రాష్ట్రం నీ అయ్య జాగీరు కాదన్నారు. రైతులు పండించే ప్రతి పంట కొనుగోలు చేయాలని... ప్రతి గ్రామంలో ఐకేపీ కేంద్రాల ద్వారానే కొనుగోలు జరగాలని  డిమాండ్‌ చేశారు. వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేయమన్న కేసీఆర్ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని... తెలంగాణలో పంట ఉత్పత్తులు కొనుగోలు చేసే వరకు కాంగ్రెస్ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని తెలిపారు.  బిజెపి,  టిఆర్ఎస్ చీకటి ఒప్పందం బట్టబయలైందని..కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఏ చట్టం తీసుకొచ్చినా కెసిఆర్ వత్తాసు పలుకుతున్నాడని ఫైర్‌ అయ్యారు. గల్లీ మే కుస్తీ.. ఢిల్లీ మే దోస్తీ అన్నట్లుగా బిజెపి, టిఆర్ఎస్ వ్యవహారం ఉందన్నారు. నాగార్జునసాగర్ లో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని.. బీజేపీకి డిపాజిట్ గల్లంతు ఖాయమని తెలిపారు.  ఐదు దశాబ్దాలుగా ప్రజాసేవ కోసం పాటుపడిన జానా రెడ్డి గారిని గెలిపించుకోవాలని ప్రజలకు సూచించారు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి.