వందల కోట్లు దోచుకొని తెలంగాణకు అన్యాయం చేస్తున్నారు...

వందల కోట్లు దోచుకొని తెలంగాణకు అన్యాయం చేస్తున్నారు...

టీఆర్ఎస్, బీజేపీలు తెలంగాణ కు తీరని ద్రోహం చేస్తున్నాయి అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం 50 లక్షల ఉద్యోగాలు వచ్చే ఐటీఐఆర్ ను ఏర్పాటు చేయలేకపోతుంది. మతతత్వ పార్టీ బీజేపీ అయోధ్య లో రామమందిర్ నిర్మాణం చేస్తాం అంటున్నారు. మరి తెలంగాణ లో ఉన్న భద్రాచలం రామ మందిర్ భూములు ఆంధ్రకు ఇచ్చి అన్యాయం చేసారు. బీజేపీ మతం పేరుతో లబ్ది పొందాలని చూస్తుంది. దేశానికి, రాష్ట్రానికి ఏమి చేయకపోగా డబ్బుల సంచులు పట్టుకొని కాంగ్రెస్ నాయకుల ఇళ్ల చుట్టూ తిరుగుతున్నారు. టీఆర్ఎస్ నాయకులు అవినీతికి పాల్పడి వందల కోట్ల రూపాయలు దోచుకొని తెలంగాణ కు అన్యాయం చేస్తున్నారు. తెలంగాణలో నిరుద్యోగుల సంఖ్య రెట్టింపు అయ్యింది. చదువుకున్న నిరుద్యోగులు 19 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. పీఆర్సీ లో రాష్ట్రం ఏర్పాటు చేసిన కమిటీనే లక్షా 91 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. అటు ఉద్యోగులను, ఇటు నిరుద్యోగులను టీఆర్ఎస్, బీజేపీలు తీవ్రంగా మోసం చేసాయి. కాబట్టి ఈ గ్రాడ్యువట్ ఎన్నికలలో ఈ రెండు పార్టీ లకు గట్టిగా బుద్ది చెప్పాలి. అప్పుడే తెలంగాణకు న్యాయం జరుగుతుంది అని ఉత్తమ్ పేర్కొన్నారు.