ప్రచారం తప్ప చేసింది ఏమీలేదు...

ప్రచారం తప్ప చేసింది ఏమీలేదు...

ప్రచారం తప్ప తెలంగాణకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చేసింది ఏమీ లేదని ఆరోపించారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి... గాంధీ భవన్‌లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన అనంతరం మాట్లాడుతూ... కేసీఆర్ ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటన్నా అమలు చేశారా? అని ప్రశ్నించారు. దళితులకు మూడెకరాల భూమి ఏమైంది? దళితుడిని సీఎం చేస్తామన్నారు ఏంచేశారు? అంటూ మండిపడ్డారు. అర్హత ఉన్న దళిత కుటుంబాలు 4 లక్షలు ఉంటే... 4 వేల మందికి మాత్రమే మూడెకరాలు ఇస్తే సరిపోతుందా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక గిరిజనుల్లో ఒక్క కుటుంబానికి కూడా భూమి ఇవ్వలేదన్నారు ఉత్తమ్... మైనారిటీలకు 12 శాతం రేజర్వేషన్ నాలుగు నెలల్లో ఇస్తామని... నాలుగేండ్లు అయినా చేయలేకపోయామని చెబితే బాగుండేదని సీఎంకు సలహా ఇచ్చారు. 

తెలంగాణలో టీఆర్ఎస్ ప్రజాస్వామ్యాన్ని అణచివేస్తోందని ఆరోపించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి... ప్రతిపక్షాలకు అసెంబ్లీలో ఉండే హక్కుని కూడా కాలరాశారని... తెలంగాణలో నేను... నా కుటుంబం బాగుంటే చాలు అనుకుంటున్నారని మండిపడ్డారు ఉత్తమ్. తెలంగాణ వచ్చాక లాభపడింది ఆ నలుగురే అన్నా టీపీసీసీ చీఫ్... నిరుద్యోగ యువత నైరాశ్యంలో ఉందన్నారు. ఊరికో ఉద్యోగం కూడా ఇవ్వలేదు... కానీ, ఇంట్లో ఐదు ఉద్యోగాలు మాత్రం ఇచ్చుకున్నారంటూ సెటైర్లు వేసిన ఉత్తమ్... టీఆర్ఎస్‌ని గద్దె దించడానికి ప్రజలు ఎదురుచూస్తున్నారని వెల్లడించారు. సామాజిక న్యాయం చేసే పార్టీ కాంగ్రెస్జజజ వచ్చే జూన్ 2 నాటికి కాంగ్రెస్ దే అధికారం అని దీమా వ్యక్తం చేశారు తెలంగాణ పీసీసీ అధ్యక్షులు.