కేసీఆర్‌కు ఉత్తమ్‌ బహిరంగ లేఖ...

కేసీఆర్‌కు ఉత్తమ్‌ బహిరంగ లేఖ...

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు బహిరంగ లేఖ రాశారు టి.పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి... డిసెంబర్ 15న తీసుకొచ్చిన పంచాయతీరాజ్ ఆర్డినెన్సును అప్రజాస్వామిక చర్యగా పేర్కొన్న ఉత్తమ్... పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను తగ్గించడం అన్యాయం అన్నారు. గతంలో బీసీ జనాభాను చేపట్టాలని హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ప్రభుత్వం కుల గణన చేపట్టాలని లేఖలో పేర్కొన్న పీసీసీ అధ్యక్షుడు... ఏబీసీడీఈ వర్గీకరణ ప్రకారం కుల గణన చేపట్టి బీసీ రిజర్వేషన్లు బీసీ జనాభా ఆధారంగా కేటాయించాలని డిమాండ్ చేశారు. అప్రజాస్వామికంగా తెచ్చిన బీసీ రిజర్వేషన్ ఆర్డినెన్స్ ను ఉపసంహరించుకోవాలని లేఖలో కోరిన టి.పీసీసీ చీఫ్... ఇటీవల రద్దు చేసిన ఓటర్లు తిరిగి నమోదు చేసుకునేలా అవకాశం కల్పించి ఓటర్ల హక్కును కాపాడాలని పేర్కొన్నారు. కాగా, పంచాయతీ ఎన్నికలకు సిద్ధమైన ప్రభుత్వం... దానికి సంబంధించిన రిజర్వేషన్లను ఇప్పటికే ఖరారు చేసిన సంగతి తెలిసిందే.