ఎమ్మెల్యే పదవికి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి రాజీనామా

ఎమ్మెల్యే పదవికి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి రాజీనామా

టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. హుజూర్ నగర్ నుంచి శాసనసభకు ఎన్నికైన ఆయన ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నల్లగొండ నుంచి విజయం సాధించారు. దీంతో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఈమేరకు తన రాజీనామా పత్రాన్ని అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యలకు కాసేపటిక్రితం అందచేశారు. ఉత్తమ్‌ రాజీనామాతో ఖాళీ అయిన హుజూర్‌నగర్‌ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికలో ఆయన సతీమణి పద్మావతిని బరిలోకి దించనున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'కోదాడ, హుజుర్ నగర్ ప్రజలు ఎంతో ఆదరించారు. నల్లగొండ ఎంపీగా గెలిచినందున నా రాజీనామా అనివార్యమైంది. ఎంపీ గా ఆ రెండు నియోజకవర్గాలతో పాటు మరో 5 నియోజక వర్గ ప్రజలకు సేవ చేసే అవకాశం ఉంది. ఇది అదృష్టంగా భావిస్తున్నా. ప్రాణం ఉన్నంత కాలం నాకు ప్రజాసేవ చేసుకుందుకు అవకాశం ఇచ్చిన నియోజక వర్గ ప్రజలకు రుణపడి ఉంటా' అని ఉత్తమ్ అన్నారు.