అఖిల పక్షం పోరాటం ఫలించిందిః ఉత్తమ్

అఖిల పక్షం పోరాటం ఫలించిందిః ఉత్తమ్

తెలంగాణలో పరిషత్ ఎన్నికల లెక్కింపు వాయిదా వేయడంపై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. అఖిలపక్షం చేసిన పోరాటం ఫలించిందని తెలిపారు. అప్రజాస్వామిక పద్దతులకు స్వస్తి పలకాలని కాంగ్రెస్ చేసిన విన్నపాన్ని ఎన్నికల కమిషన్ అంగీకరించడం హర్షనీయమని వ్యాఖ్యానించారు. మేము చేసిన పోరాట ఫలించింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల తరువాత ఎంపీపీ, జెడ్పీ పదవుల ఎన్నికలకు 40 రోజుల విరామం ఉన్నందున అధికార పార్టీ అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందని అఖిల పక్షం సభ్యులు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.