పొత్తుల అంశం తేలాకే అభ్యర్థులను ప్రకటిస్తాం..

పొత్తుల అంశం తేలాకే అభ్యర్థులను ప్రకటిస్తాం..

'మహాకూటమి' వేదికగా పోటీ చేయాలని నిర్ణయించినా..ఇంకా సీట్ల కేటాయింపుపై చర్చలు జరగలేదని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. ఇవాళ గాంధీభవన్‌లో ఆయన మాట్లాడుతూ కూటమికి ఎవరు నాయకత్వం అనేది అందరితో చర్చించి నిర్ణయిస్తామన్నారు. అభ్యర్థుల ప్రకటన స్క్రీనింగ్ కమిటీ పరిధిలో ఉందన్న ఉత్తమ్‌.. పొత్తుల అంశం తేలకుండా కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన ఉండబోదన్నారు. పార్టీ ఎన్నికల కమిటీల నియామకం రాహుల్ పరిశీలనలో ఉందని.. త్వరగా కమిటీలు వేయాలని తాను కూడా ఏఐసీసీ ని అడుగుతున్నానని చెప్పారు.