వాజ్‌పేయ్‌ పేరుతో ఓ హిమాలయ పర్వతం

వాజ్‌పేయ్‌ పేరుతో ఓ హిమాలయ పర్వతం

హిమాలయాల్లోని ఓ పర్వాతానికి భారత మాజీ దివంగత ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి పేరును పెట్టనున్నట్లు ఉత్తరఖండ్‌ ప్రభుత్వం ప్రకటించింది. ఆయన హాయంలోనే ఉత్తరఖండ్‌ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించింది. ఆయన మా రాష్ట్ర ప్రజలకు చేసిన మేలును ఎన్నటికి మరవం. వాజ్‌పేయి ప్రకృతి ప్రేమికుడు. అడవులు, పర్వతాలు అంటే ఆయనకు చాలా ఇష్టం. అందువల్లే హిమలయాల్లోని ఓ పర్వతానికి వాజ్‌పేయి పేరు పెట్టాలని నిర్ణయించాం అని తెలిపింది. 

జార్ఖండ్ ప్రభుత్వం బీజేపీ నాయకుడి గౌరవార్థం రాష్ట్రంలోని ఏడు ప్రదేశాలకు వాజ్‌పేయి పేరు పెట్టబోతున్నారు. చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ త్వరలో నిర్మించబోయే చత్తీస్‌గఢ్ నూతన రాజధాని ‘నయా రాయ్‌పూర్‌’ను ‘అటల్ నగర్‌’గా మార్చనున్నట్లు ప్రకటించారు. వాజ్‌పేయి మరణించిన తరువాత, అనేక రాష్ట్ర ప్రభుత్వాలు, మునిసిపల్ కార్పొరేషన్లు, నాయకులు కేంద్రం ఆమోదంతో మాజీ ప్రధాని గౌరవార్థం తమ తమ ప్రాంతాల్లోని అనేక ప్రదేశాల పేర్లను మార్చాలని  నిర్ణయించుకున్నారు.