బోటులో కేబినెట్

బోటులో కేబినెట్

ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రులు వినూత్నంగా ఆలోచిస్తున్నారు. సాంప్రదాయంగా వస్తున్న కొన్ని విధానాలను పక్కనబెట్టి.. పాలనలో కొత్తగా ముందుకు వెళుతున్నారు. ఈ క్రమంలో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్‌ ఎప్పుడూ సచివాలయంలో జరిగే కేబినెట్ మీటింగ్‌ను బోటులో ఏర్పాటు చేశారు. మంత్రులతో కలిసి తెహరి సరస్సు వద్దకు వెళ్ళిన సీఎం.. పూలతో అందంగా అలంకరించిన బోటును ఏక్కి.. రాష్ట్రాభివృద్ధికి కావాల్సిన పలు నిర్ణయాలను తీసుకున్నారు. రావత్ మంత్రులతో చర్చిస్తున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.