దేశంలో మరో ముఖ్యమంత్రికి కరోనా...
దేశంలో కరోనా కేసులు ఉధృతి కొనసాగుతోంది. ఇప్పటికే దేశంలో 99 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతున్నా, జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి. సామాన్యుల నుంచి రాజకీయ నాయకుల వరకు కరోనా ఎవర్ని వదలడం లేదు. అటు ముఖ్యమంత్రులకు కూడా కరోనా సోకుతున్నది. తాజగా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ కు కరోనా సోకింది. ఈ విషయాన్ని త్రివేంద్ర సింగ్ రావత్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. తాను ఈరోజు కరోనా టెస్టులు చేయించుకున్నానని, ఈ టెస్టుల్లో తనకు కరోనా పాజిటివ్ వచ్చినట్టు నిర్ధారణ జరిగిందని ముఖ్యమంత్రి ట్విట్టర్ లో పేర్కొన్నారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని, వైద్యుల సూచనల మేరకు హోమ్ ఐసోలేషన్ ఉన్నట్టు తెలిపారు. ప్రోటోకాల్ ప్రకారం తనను కలిసిన వ్యక్తులు కరోనా నిర్ధారణ టెస్టులు చేయించుకోవాలని ముఖ్యమంత్రి ట్విట్టర్ లో పేర్కొన్నారు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)