ఘోర ప్రమాదం - ఏడుగురు మృతి 

ఘోర ప్రమాదం - ఏడుగురు మృతి 

ఉత్తరాఖండ్ లో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 7గురు కార్మికులు మృతిచెందారు. ఐదుగురు గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.  కేదార్‌నాథ్‌కు వెళ్లే మార్గం.. బన్సవారి ప్రాంతంలోని రుద్రప్రయాగ్ గౌరీ కుండ్ రహదారిపై సమీపంలో కొండచరియలు విరిగిపడటంతో ఈ ప్రమాదం జరిగింది.  క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే విపత్తు నిర్వహణ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుంది. శిథిలాల నుంచి ఐదుగురిని సజీవంగా బయటకు తీశారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.  కొండను తొలిచి రహదారి నిర్మాణ పనులు చేస్తుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం.