దాసరి విగ్రహాన్ని తిరిగి పెట్టాలి !

దాసరి విగ్రహాన్ని తిరిగి పెట్టాలి !

13వ తేదీన విశాఖ బీచ్ రోడ్లో ఉన్న సినీ ప్రముఖులు దాసరి నారాయణరావు, అక్కినేని నాగస్వరరావు, నందమూరి హరికృష్ణల విగ్రహాల్ని అధికారులు తొలగించిన సంగతి తెలిసిందే.  దీనిపై ఉత్తరాంధ్ర సినీ దర్శకుల సంఘం నిరసనకు దిగింది.  విగ్రహాలను తిరిగి ఏర్పాటుచేయాలని, లేని పక్షంలో తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరికలు చేసింది.  మరి సంబంధిత అధికారులు, పోలీసులు ఈ విషయంపై ఎలా రియాక్ట్ అవుతారో.