'సైరా' ఎవరి చేతికి వెళ్లిందో తెలుసా

'సైరా' ఎవరి చేతికి వెళ్లిందో తెలుసా

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'సైరా' చిత్రంపై ఎంతటి అంచనాలున్నాయో తెలిసిన సంగతే.  ఈ చిత్ర హక్కులకు భారీ డిమాండ్ నెలకొంది.  బడా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు రైట్స్ కోసం పెద్ద మొత్తంలో చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారు.  ఇంత పోటీ నడుమ ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ భారీ మొత్తం చెల్లించి ఈ చిత్రం యొక్క ఏపీ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ సొంతం చేసుకుందని తెలుస్తోంది.  యూవీ క్రియేషన్స్ ఒకవైపు 'సాహో' లాంటి పెద్ద బడ్జెట్ చిత్రాలను నిర్మిస్తూనే ఇలా డిస్ట్రిబ్యూషన్ వైపు కూడా దృష్టి పెట్టడం విశేషం.  ఇకపోతే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మితమవుతున్న 'సైరా' అక్టోబర్ 2వ తేదీన విడుదలకానుంది.