యువీ క్రియేషన్స్ కొత్త బ్యానర్.. వారి కోసమేనట..

యువీ క్రియేషన్స్ కొత్త బ్యానర్.. వారి కోసమేనట..

ప్రస్తుతం టాలీవుడ్‌లో పేరు పొందిన బ్యానర్స్‌లో యూవీ క్రియేషన్స్ ఒకటి. ఇప్పుడూ భారీ బడ్జెట్ సినిమాలు చేస్తూ విజయాలను తన ఖాతాలో వేసుకుంది. ఈ బ్యానర్ ఓ సినిమాకు ఓకే చెప్పిందంటే ఆ సినిమా పక్కా హిట్ అవుతుందన్న టాక్ కూడా ఉంది. ఈ బ్యానర్ 2013లో రెబల్ స్టార్ ప్రభాస్ ‘మిర్చి’ సినిమా చేసి భారీ విజయంతో పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆ తరువాత శర్వానంద్ హీరోగా రన్ రాజా రన్ అనీ వసూళ్లను పరిగెత్తించింది. దాని తరువాత నాచురల్ స్టార్ నానీ హీరోగా ‘భలే భలే మగాడివోయ్’, అనుష్క ‘భాగమతి’, ప్రభాస్ ‘సాహొ’ లతో పాటు అనేక సినిమాలను తెరకెక్కించింది. ఇటీవల ప్రభాస్-పూజా హిగ్దే జంటగా పాన్ ఇండియా రేంజ్‌లో వస్తున్న రాధేశ్యామ్ సినిమా కూడా ఈ బ్యానర్ ప్రొడక్టే. ఈ సినిమా భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది. అయితే ఇప్పుడు ఈ బ్యానర్ మరో కొత్త ప్రొడక్షన్ హౌస్‌ను రెడీ చేస్తుంది. ఈ కొత్త బ్యానర్‌కు ‘వీ సెల్యులాయిడ్స్’ అనే పేరును ఖరారు చేసింది. ఇందులో నిర్మాతలు వంశీ, విక్రమ్‌లు భాగస్వామ్యంకానున్నారు. ఎప్పటికే విజయాల పరంపర సాగిస్తున్న బ్యానర్ ఉన్నా ఇప్పుడు ఇంకో కొత్త బ్యానర్ ఎందకని సందేహాలు వచ్చాయి. అయితే ఈ కొత్త బ్యానర్ చిన్న, మధ్యస్థాయి సినిమాలు తీస్తారట. ప్రతిభ ఉన్న కొత్త దర్శకులకు, నటులకు అవకాశాలు ఇచ్చేందుకు ఈ కొత్త ప్రొడక్షన్ హౌస్‌ను నిర్మించనున్నారట. ఈ బ్యానర్‌లో ఎక్కువ శాతం కంటెంట్ బేస్‌డ్ సినిమాలను నిర్మిస్తారని వార్తలు వస్తున్నాయి. నిజానికి యూవీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ కలిసి మధ్య తరహా సినిమాలు చేసేందుకు జీఎ2 క్రియేషన్స్‌ను ఏర్పాటు చేశారు. ఇప్పుడు యూవీ తన సొంతగా స్మాల్ మూవీస్ కోసం వి సెల్యులాయిడ్స్‌ను ప్రారంభింస్తోందట. మరి ఈ రెండో బ్యానర్ ఎంతవరకు విజయాలను సాధిస్తుందో చూడాలి.