ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఇల్లు ఇప్పుడెలా ఉందో చూశారా ?

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఇల్లు ఇప్పుడెలా ఉందో చూశారా ?

భారతదేశ స్వాతంత్ర సంగ్రామ చరిత్రలో బ్రిటిషర్లపై పోరాటం చేసిన తొలి తెలుగు పోరాట యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి.  రేనాటి వీరుడిగా సుపరిచితం.  ఆంగ్లేయులపై అయన చేసిన పోరాటం అద్భుతం అని చెప్పాలి.  ఉయ్యాలవాడ నరసింహారెడ్డి 64 గ్రామాలకు రాజుగా ఉండేవాడు.  స్వాతంత్రం కోసం కర్నూలు జిల్లాలో పోరాటం చేశారు.  అయన చరిత్ర గురించి చాలామంది తెలియదు.  చరిత్రలో అయన పేరు కూడా కొన్ని పేజీలు ఉన్నాయి.  

అయన చరిత్రను ప్రపంచానికి తెలియజేసేందుకు మెగాస్టార్ చిరంజీవి సైరా పేరుతో సినిమా తీస్తున్నారు.  దీంతో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎవరు, అయన ఎలాంటి పోరాటం చేశారు అనే విషయాల గురించి ఆరాతీయడం మొదలు పెట్టారు.  రేనాటి వీరుడిగా ఆయనకే పేరుంది.  పెద్ద సంస్థానంగా ఉండే అయన ఇల్లు చరిత్రకు సాక్ష్యంగా పాక్షికంగా మిగిలి ఉన్నది.  సైరా సినిమా తరువాతైనా ప్రభుత్వం ఈ వీరుడు నివసించిన ఇంటిని పరిరక్షిస్తే..బాగుంటుంది.