ట్రాఫిక్ చలాన్లపై వీహెచ్ ఫైర్..

ట్రాఫిక్ చలాన్లపై వీహెచ్ ఫైర్..

ఎప్పుడూ ఏదో ఇష్యూతో మీడియాలో కనిపించే కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు... ఇవాళ హైదరాబాద్‌లో రోడ్డుపై హల్‌చల్ చేశారు. సిటీ ట్రాఫిక్ పోలీసుల వైఖరి పట్ల కస్సుబుస్సులాడిన వీహెచ్... తెలుగుతల్లి ఫ్లైఓవర్ సమీపంలోని ఏజీ ఆఫీస్ దగ్గర వాహనాలకు చలాన్లు వేస్తున్న పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మొదట వాహనదారులతో మాట్లాడిన వీహెచ్.. ఆ తర్వాత పోలీసు అధికారితో వాగ్వాదానికి దిగారు. ప్రజలను ఎండలకు పరేషాన్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిన వీహెచ్... చలాన్లు వేస్తున్న పోలీసులను అడ్డుకుని... వాహనదారులను అక్కడి నుంచి పంపించేశారు.