అంబేద్కర్‌ విగ్రహం ధ్వంసంపై వీహెచ్ నిరసన

అంబేద్కర్‌ విగ్రహం ధ్వంసంపై వీహెచ్ నిరసన

హైదరాబాద్‌లోని పంజాగుట్టలో దాదాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం తొలగింపు, అనంతరం డపింగ్ యార్డ్‌కు తరలించి అవమానించడంపై ఆందోళనకు దిగారు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి. హనుమంతరావు... హైదరాబాద్‌లో అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ ఆయన కాకినాడలో నిరసన చేపట్టారు. కాకినాడ వెళ్లిన వీహెచ్... ఇంద్రపాలెం వంతెన వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.. అనంతరం.. అంబేద్కర్ విగ్రహం బైఠాయించి ఆందోళనకు దిగారు. మరోవైపు నిరసన వద్దని కాంగ్రెస్ పార్టీ స్థానికల నేతలు ఆయనను వారించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, వీహెచ్‌కు మధ్య వాగ్వాదం జరిగింది.