వీహెచ్ సంచలన వ్యాఖ్యలు..

వీహెచ్ సంచలన వ్యాఖ్యలు..

కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు (వీహెచ్) సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమలలో మీడియాతో మాట్లాడిన ఆయన... కాంగ్రెస్ పార్టీలో నిజమైన కార్యకర్తలకు న్యాయం జరగడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలు, ఎస్టీ, ఎస్సీలను పక్కనబెట్టి అగ్ర కులాలు వారే పెత్తనం చేస్తున్నారని.. తెలంగాణ వచ్చినా సామాజిక న్యాయం జరగడంలేదని, నిజమైన కాంగ్రెస్‌ వాదులను పక్కనబెట్టి... పార్టీ మారినవారికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ఫైర్ అయ్యారు. వీటిపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆలోచనా విధానం మారాలని సూచించిన వీహెచ్.. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత మరిన్ని అంశాలపై మాట్లాడుతానన్నారు.