యూట్యూబ్ ఆడియన్స్ ఫిదా అయ్యారు..!!

యూట్యూబ్ ఆడియన్స్ ఫిదా అయ్యారు..!!

సినిమా ప్రమోషన్లకు యూట్యూబ్ వేదికగా మారింది.  ఫస్ట్ లుక్, సాంగ్స్, వీడియో ఇలా ప్రతి ఒక్క దాన్ని ఇప్పుడు యూట్యూబ్లో పోస్ట్ చేస్తున్నారు.  పెద్ద స్టార్స్ సినిమాలకు సంబంధించిన ప్రతి చిన్న వీడియోకు నిమిషాల్లోనే లక్షల సంఖ్యలో వ్యూస్ వస్తుంటాయి.  సినిమా హిట్ కావడానికి యూట్యూబ్ కూడా ఇప్పుడు ఉపకారిణిగా మారింది.  

రంగస్థలంలోని రంగమ్మ.. మంగమ్మ పాట 100 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకొని దూసుకుపోయి టాలీవుడ్ లో టాప్ ప్లేస్ లో నిలిచిన సంగతి తెలిసిందే.  ఇది 24  గంటల్లోనే.. ఫిదా సినిమాలోని "వచ్చిండే" సాంగ్ 150 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకొని రికార్ట్ సృష్టించింది.  ఒక పాటకు ఇన్ని వ్యూస్ వచ్చిన తొలి టాలీవుడ్ సినిమాగా ఫిదా ఘనత సాధించింది.  సాయి పల్లవి తొలిసారిగా తన పాత్రకు డబ్బింగ్ చెప్పుకుంది.  అచ్చమైన తెలంగాణ యాసలో సాగే ఆమె భాష, హావభావాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.  శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమా క్లాస్ మాస్ అందరిని ఆకట్టుకుంది.