కరోనా వ్యాక్సిన్ పై పలు అనుమానాలు... ఈ ఏడాది కష్టమే...!!

కరోనా వ్యాక్సిన్ పై పలు అనుమానాలు... ఈ ఏడాది కష్టమే...!!

కరోనా వైరస్ వ్యాక్సిన్ కోసం ఇండియాలో వేగంగా పరిశోధనలు జరుగుతున్నాయి.  ఇప్పటికే రెండు కంపెనీలు సూదిమందును కనుగొన్నాయి.  అయితే, వీటిని   మనుషులపై ప్రయోగించాల్సి ఉన్నది.  వీలైంత త్వరగా మనుషులపై ప్రయోగాలు చేసి ఆగష్టు 15 వరకు ఈ వ్యాక్సిన్ ను అందుబాటులోకి తీసుకురావాలని చూస్తున్నారు.  అయితే, ఆగష్టు 15 వరకు వ్యాక్సిన్ ను తీసుకురావడం కష్టం అని అంటున్నారు సిసిఎంబి అధికారులు. 

వ్యాక్సిన్ ను మనుషులపై ప్రయోగాలు చేసి, ఫలితాలు నిర్ధారించి వ్యాక్సిన్ ను బయటకు తీసుకురావడానికి కనీసం ఆరు నుంచి ఎనిమిది నెలల సమయం పడుతుందని, ప్రయోగాలు  పూర్తి స్థాయిలో సక్సెస్ కాకుండా వ్యాక్సిన్ ను బయటకు తీసుకు రావడం కష్టం అని సీసీఎంబీ అధికారులు చెప్తున్నారు.  వచ్చే ఏడాది మొదట్లో కరోనా వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు.  అయితే, ఐసీఎంఆర్ మాత్రం కరోనా వ్యాక్సిన్ ను ఆగష్టు 15 నాటికి తీసుకొస్తామని చెప్తున్నది.