అఖిల్ కొత్త సినిమాలో బీటౌన్ బ్యూటీ

అఖిల్ కొత్త సినిమాలో బీటౌన్ బ్యూటీ

అక్కినేని యువహీరో అఖిల్ అక్కినేని ప్రస్తుతం వరుస సినిమాలను లైన్‌లో పెట్టి బిజీగా గడుపుతున్నాడు. ఇటీవల మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాను పూర్తి చేసుకున్న అఖిల్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తన నూతన సినిమాను చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో స్పైగా అఖిల్ దర్శనం ఇవ్వనున్నాడట. అయితే ఇందులో అఖిల్ సరసన నటించేది ఎవరి అందరూ అనుకుంటున్నారు. ఈ విషయంలో తాజాగా బీటౌన్ బ్యూటీ పేరు వినిపిస్తోంది. కొత్త హీరోయిన్‌ కోసం వెతుకుతున్న సురేందర్ బాలీవుడ్‌పై కన్నేశాడు. అంతే అక్కడ కనిపించిన ఓ మోడలింగ్ భామని చూసి దర్శకుడు ఫిదా అయిపోయాడట. దాంతో వెంటనే అమ్మడిని ఓకే చేశాడు. ఆమె పేరు వైద్య సాక్షి, బాలీవుడ్ మోడలింగ్‌లో రాణిస్తోంది. అమెనే అఖిల్ సినిమాలో హీరోయిన్‌గా తీసుకురానున్నారట. ఆమె ఇంతకు ముందు చేసిన యాడ్స్‌ను, ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ ఫోటోలను చూసి మరీ సురేందర్ రెడ్డి ఫిక్స్ చేశాడు. తన సినిమాలో హీరోయిన్ పాత్రకు సాక్షి అయితేనే స్పార్క్ వస్తుందని సురేందర్ నమ్ముతున్నాడు. ఈ చిత్రం వచ్చె నెలలో పట్టాలెక్కనుంది.