క్రిష్ డైరెక్షన్ లో మరో మెగా హీరో

క్రిష్ డైరెక్షన్ లో మరో మెగా హీరో

గమ్యం ,  వేదం సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు క్రిష్ జాగర్లమూడి. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ ఒక సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా పిరియాడికల్ డ్రామా గా తెరకెక్కనుందని తెలుస్తుంది. ఇదిలా ఉంటే క్రిష్  త్వరలో మరో హీరో తో సినిమా చేయబోతున్నాడని తెలుస్తుంది. మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగా సాయి ధరమ్ తేజ్ సోదరుడుగా 'ఉప్పెన' సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు పంజా వైష్ణవ్ తేజ్. ఈ సినిమా కరోనా కారణంగా ఆగిపోయింది. ఈ లోగా మరో సినిమాకు సిద్దమయ్యాడు వైష్ణవ్  . క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు .  ఈ సినిమాలో వైష్ణవ్ కి జోడీగా స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ నటించనుంది. రాజీవ్ రెడ్డి మరియు జాగర్లమూడి సాయిబాబా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. రేపటి నుండి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసి అక్టోబర్ ఎండింగ్ వరకు సింగిల్ షెడ్యూల్ లో ఈ చిత్రాన్ని కంప్లీట్ చేయనున్నారు.